ప్రజావాణికి ప్రజల విశేష స్పందన - సమస్యలు పరిష్కరించాలంటూ విన్నపాలు - Prajavani Program in Telangana
🎬 Watch Now: Feature Video
Published : Mar 1, 2024, 2:16 PM IST
Prajavani Program in Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజాభవన్‌కు తరలివచ్చి అధికారులతో తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం సమర్పించి పరిష్కరించాలని కోరుతున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ, ఆరోగ్యం, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Huge Rush At Prajavani Program : ఇవాళ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో శామీర్ పేటలో కార్మికుల పట్ల దామోదర్ రెడ్డి అనే వ్యక్తి అరాచకాలకు పాల్పడుతున్నారని, కార్మికుల వేతనాలను కూడా బలవంతంగా వసూలు చేస్తున్నారని సీపీఐ, సీపీఎం నాయకులు ఆరోపించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ పోస్టులు కల్పించాలని దివ్యాంగుల వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు ప్రవీణ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.