దిమిసీమలో వెలుగుచూసిన ఇక్ష్వాకుల బ్రాహ్మి శాసనం - పరిశీలించిన బుద్ధప్రసాద్ - Poturaju Rock - POTURAJU ROCK
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 28, 2024, 8:29 PM IST
Poturaju Rock of Ikshvaku Period in Krishna District : కృష్ణాజిల్లాలో ఇక్ష్వాకుల కాలం నాటి బ్రాహ్మి శాసనం గల పోతురాజు శిల వెలుగులోకి వచ్చింది. పురిటిగడ్డ గ్రామంలోని పోతురాజు దేవాలయం పునర్నిర్మాణ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఈ శిలను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఈ ప్రాచీన శిల మూడవ శతాబ్దం నాటిది అని తెలిపారు. ఈ శిలపై ప్రాకృత భాషలో ఆనందా అనే బౌద్ధ గురువు వేయించినట్లు ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాసనం అధికారులు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
శాతావాహనుల తర్వాత ఇక్ష్వాకులు క్రీ.శ 200 - 218 మధ్య దాదాపు వందేళ్లపాటు నాగార్జునకొండ సమీపంలోని విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారని తెలిపారు. ఆ సమయంలోనే దివిసీమ ప్రాంతం వారి పాలనలో ఉండేదని పేర్కొన్నారు. కృష్ణానది లోయలో బౌద్ధ మతాన్ని వ్యాపింపచేయడమే కాకుండా బౌద్ధ శిల్ప కళలను ప్రోత్సహించారని చెప్పారు. నాగార్జున కొండను గొప్ప బౌద్ధ విద్యా కేంద్రంగా రూపొందించారని ఇక్ష్వాకుల చరిత్రను వివరించారు. దేశ విదేశాల్లో నుంచి విద్యను అభ్యసించడానికి ఇక్కడకు వచ్చేవారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పురిటిగడ్డ ఖాది ఉత్పత్తికి కేంద్రంగా వర్ధిల్లిందని తెలియజేశారు.