మాత శిశు అంబులెన్స్‌ని కూడా అటకెక్కించారా! మన్యంలో వాహనం లేక అవస్థలు పడుతున్న బాలింతలు - No Matha Shishu Ambulance in Paderu
🎬 Watch Now: Feature Video
No Matha Shishu Ambulance in Paderu : మాత శిశు అంబులెన్స్ లేక తల్లి శిశువును ఆసుపత్రి బయట కూర్చున్న ఘటన అల్లూరి జిల్లా పాడేరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే రెండు రోజుల క్రితం నిండు గర్భిణిని 10 కిలోమీటర్ల మేర మోసుకొచ్చి అంబులెన్స్ వద్దకు చేర్చగా మార్గ మధ్యలోనే ఆమె ప్రసవం అయ్యింది. అయితే వారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 12గంటలకు ఆమెను డిశ్చార్జ్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది డీజిల్ లేదని చెప్పడంతో శిశువును వడిలో పెట్టుకుని ఆ తల్లి ఆసుపత్రి బయట కూర్చోని ఉంది. తమ గ్రామానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద చిల్లిగవ్వ లేదని బాధితులు ఆసుపత్రి బయట అంబులెన్స్ కోసం వేచి చూశారు.
సిబ్బంది సాకులు : కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే అంబులెన్స్‌లో డీజిల్ లేదని, అంబులెన్స్‌లు లేవని, ఆసుపత్రిలో డెలివరీ కాలేదంటూ సాకులు చెప్పి తప్పుంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు ఉన్న గిరిజన కుటుంబాలకు మాత శిశు అంబులెన్స్ ఇవ్వకపోవడం దారుణమని పలువురు ప్రశ్నిస్తున్నారు.