గోవా నుంచి తెచ్చి హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయం - రాజ్‌తరుణ్ ప్రేయసి అరెస్ట్ - Police Seized Drugs from a Woman
🎬 Watch Now: Feature Video
Published : Jan 29, 2024, 7:04 PM IST
|Updated : Jan 29, 2024, 7:45 PM IST
Police Seized Drugs from a Young Woman in Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినిపించకూడదని రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి డ్రగ్స్ ముఠాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు, ఎక్కడ మత్తు పదార్థాల వాసన వచ్చినా అక్కడ వాలిపోతున్నారు. వాటిని అమ్మేవారితో పాటు కొనుగోలుదారులనూ అరెస్ట్ చేసి ఊచలు లెక్కపెట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగర శివార నార్సింగిలో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
పక్కా సమాచారం మేరకు డ్రగ్స్ విక్రయదారులపై దాడులు చేసిన స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు, ఓ యువతి వద్ద 4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. యువతిని సినీనటుడు రాజ్‌తరుణ్ ప్రేయసిగా గుర్తించిన పోలీసులు, ఆమెపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ డ్రగ్స్ గోవా నుంచి తీసుకొచ్చి నగరంలో విక్రయాలు జరుపుతున్నట్లు వెల్లడించిన పోలీసులు, యువతికి డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారనే కోణంలో విచారణ చేస్తున్నారు.