బందోబస్తుకు వచ్చారు - పేక పట్టారు - వీడియో వైరల్ - POLICE PLAYING CARDS VIDEO VIRAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2024, 4:50 PM IST
Police Playing Cards Video Viral: ఎవరైనా జూదం ఆడితే వారిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పోలీసులే దారి తప్పారు. విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల కోసం వచ్చి దర్జాగా రూమ్లో జూదం ఆడటం ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ పోలీసు ఉన్నతాధికారులు స్పందించలేదు.
దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గగుడి వద్ద బందోబస్తు డ్యూటీ కోసం వచ్చి నలుగురు సీఐలు హోటల్లో జూదం ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీరిలో విజయవాడ టూ టౌన్ సీఐ కొండల రావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐలు జూదం ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలపై పోలీస్ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్టు సమాచారం. జూదం ఆడుతున్న సీఐలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.