ఉరవకొండలో పోలీసుల అత్యుత్సాహం - ఇబ్బందులు పడ్డ ప్రజలు - POLICE OVER ACTION IN URAVAKONDA - POLICE OVER ACTION IN URAVAKONDA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 6, 2024, 2:22 PM IST
Police Over Action in Uravakonda : అనంతపురం జిల్లా ఉరవకొండలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పార్టీ కార్యాలయానికి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే (EX MLA) విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్ రెడ్డి వస్తున్నారనే సమాచారంతో దాదాపుగా 200 మంది పోలీసులు మోహరించారు. ప్రణయ్ రెడ్డి ఉరవకొండకు రావటానికి వీల్లేదని ఎస్పీ గౌతమి సాలి హెచ్చరించారు. ప్రణయ్ రెడ్డి ఏమాత్రం ఖాతరు చేయకుండా ఉరవకొండకు వచ్చారు.
పోలీసులు అత్యుత్సాహంతో 200 మందితో బందోబస్తు నిర్వహించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద రహదారిపై వాహనదారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రణయ్ రెడ్డి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఉండటంతో పాదచారులను కూడా గుర్తింపు కార్డులు చూపించాలని ఇబ్బంది పెట్టారు. మీడియా ప్రతినిధులను గుర్తింపు కార్డులు ఉంటేనే వైఎస్సార్సీపీ కార్యాలయం సమీపంలోకి అనుమతిస్తామని వారితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఇంత బందోబస్తు ఎందుకని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.