రూ.68 లక్షల విలువైన మద్యం ప్రొక్లెయిన్‌తో ధ్వంసం - karnataka liquor destroy - KARNATAKA LIQUOR DESTROY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 8:02 PM IST
Police Officials Destroyed Seized Karnataka liquor bottles in Satyasai District : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణ శివారులో పట్టుబడిన మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. ఏడాది కాలంగా సెబ్, పోలీసు అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.68 లక్షలు విలువ చేసే 10 వేల లీటర్ల కర్ణాటక మద్యం, నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ పి. రత్న తెలిపారు. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమ మద్యం తరలింపులో దాదాపు 1400 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పట్టుబడిన మద్యం సీసాలను ప్రొక్లెయిన్‌తో తొక్కించి ధ్వంసం చేశారు.
Penukonda Satyasai District : సెబ్, పోలీసు అధికారులు కలిసికట్టుగా అక్రమ మద్యం పట్టుకున్నారని జిల్లా ఎస్పీ రత్న ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్‌లో కూడా సెబ్, పోలీస్ అధికారుల సహకారంతో అక్రమ మద్యం రవాణాను అరికట్టతామని పేర్కొన్నారు. అక్రమ మద్యం పట్టుకునేందుకు సహకరించిన సెబ్, పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ రత్న అభినందించారు.