పోలింగ్ కేంద్రం వద్ద సీఐ అత్యుత్సాహం- ఉద్యోగులు, ఉపాధ్యాయులతో వాగ్వాదం - Postal Ballot Voting Centre - POSTAL BALLOT VOTING CENTRE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 3:36 PM IST
Police Got an Argument With Employees in Voting Center: శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. చిన్నపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేచి ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులతో రూరల్ సీఐ రాగిరి రామయ్య వాగ్వాదానికి దిగారు. ఓటు వేసేందుకు వచ్చిన వారిని సీఐ బయటకు వెళ్లమనడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ది చెప్పేందుకు ఉద్యోగులు ప్రయత్నించినా సీఐ రామయ్య వినకుండా వారిని బయటికి వెళ్లమన్నారు.
ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన పోలీసు అధికారే ఓటింగ్ వేయడానికి వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపుతోంది. సమస్య వస్తే పరిష్కరించాల్సిన పోలీసే ఉద్యోగస్థులపై ఇంత దురుసుగా ప్రవర్తిస్తారా అని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పోస్టల్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన తాగడానికి మంచినీళ్లు కూడా లేవని ఉద్యోగస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.