నారావారిపల్లెలో పోలీసుల బందోబస్తు - Naravaripalle village - NARAVARIPALLE VILLAGE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-06-2024/640-480-21627599-thumbnail-16x9-naravaripalle.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 10:38 PM IST
Naravaripalle village: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారా చంద్రబాబు నాయుడు స్వగృహం నారావారిపల్లెలో అలాగే హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చంద్రగిరి పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లెలోని ఆయన స్వగృహం ముందు పట్టిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా కాశిపెంట్ల గ్రామంలో ఉన్న హెరిటేజ్ ప్లాంట్ వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలలో వాహనాలను తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులను విచారించి పంపుతున్నారు. నారావారిపల్లెలోకి కొత్త వ్యక్తులు కానీ అనుమానస్పదంగా ఉన్న వారు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఎలాంటి అవాచంనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు పోలీసలు పేర్కొన్నారు.