thumbnail

ఎమ్మార్వో హత్య నిందితుడిని గుర్తించాం- రియల్‌ ఎస్టేట్‌, భూవివాదాలే కారణం: సీపీ రవిశంకర్‌

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 5:40 PM IST

Police Commissioner Presmeet on Tehsildar Murder Case: ఎమ్మార్వో సనపల రమణయ్య హత్య కేసులో నిందితుడిని గుర్తించినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్‌ వెల్లడించారు. నిందితుడు పేరు, వివరాలు గుర్తించామన్న ఆయన విచారణ కారణంతో పూర్తి వివరాలను వెల్లడి చేయడం లేదని  తెలిపారు. త్వరితగతిన నిందితుడిని అరెస్ట్ చేస్తామని కమిషనర్ అన్నారు. ఈ కేసు దర్యాప్తునకు ఇద్దరు ఏసీపీలను, 10 బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడు ఎయిర్‌పోర్టు వైపు వెళ్లినట్లు గుర్తించామని, విమానం కూడా ఎక్కినట్లు తెలిసిందని సీపీ తెలిపారు. నిందితుడి సెల్ డేటా ద్వారా విచారిస్తున్నట్లు త్వరలోనే ఆ నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. నిందితుడు ఒక బ్యాంక్ లోన్ వ్యవహారంలో డిఫాల్టర్​గా ఉన్నాడని గుర్తించినట్టు చెప్పారు. త్వరితగతిన నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. హత్యకు కారణం రియల్‌ ఎస్టేట్‌, భూవివాదాలేనని అన్నారు. ఈ క్రమంలో తహసీల్దార్‌ రమణయ్య మృతదేహానికి విశాఖ కేజీహెచ్​లో పంచనామా పూర్తయిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. రమణయ్యకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులు నివాళులర్పించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.