ముమ్మరంగా వాహన తనిఖీలు - సరైన ఆధారాలు లేకుంటే సీజ్ - Police checking vehicles - POLICE CHECKING VEHICLES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 7:46 PM IST

Police Checking Vehicles due to Election Code in Guntur : రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకులతో పాటు అధికారులలో సైతం అలజడి మెుదలైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్న అధికారులు వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికలు సజావుగా జరగటానికి ఎక్కడ కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై పోలీసులు నిఘా పెంచారు. దీనికోసం అన్ని జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో గుంటూరు జాతీయ రహదారి, ప్రధాన మార్గాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.  

దీనికోసం జాతీయ రహదారి సహా ప్రధాన మార్గాల్లో వాహన తనిఖీలను ముమ్మరంగా చేస్తున్నారు. కార్లు, వ్యాన్లతో పాటు ద్విచక్రవాహనదారుల్ని సైతం ఆపి క్షుణంగా పరిశీలిస్తున్నారు. వాహనాల్లో తీసుకెళ్లుతున్న బాక్సులు, బ్యాగ్‌లను సైతం సోదాలు చేస్తున్నారు. ఆసుపత్రి, వ్యాపార సంబంధిత అవసరాల కోసం నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా ఆ బిల్లులు వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. లెక్కకు మించి నగదును, బంగారాన్ని తరలిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.