కరకట్ట వద్ద లోకేశ్ కాన్వాయ్‌లో తనిఖీలు - కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని వెల్లడి - Police Checking Lokesh Convoy - POLICE CHECKING LOKESH CONVOY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-03-2024/640-480-21060267-thumbnail-16x9-police-checking-lokesh-canvoy-in-karakatta.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 24, 2024, 10:34 AM IST
Police Checking Nara Lokesh Convoy at Karakatta : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీ చేశారు. తాడేపల్లిలో ప్రచారానికి వెళ్తున్న లోకేశ్ కాన్వాయ్‌ను ఆపి వాహనాల్లో సోదాలు నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక లోకేశ్ ప్రచారానికి వెళ్తున్న ప్రతిసారీ ఆయన కాన్వాయ్‌ను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ కూడా తనిఖీలు చేపట్టగా వాహనం దిగి లోకేశ్ సహకరించారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేశ్ ప్రచారం సాగుతోందని పోలీసులు తెలిపారు.
మంగళగిరి నియోజకవర్గంలోని మెల్లెంపూడిలో శనివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నదే టీడీపీ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు. పొత్తుపై వైసీపీ నాయకులు మైనార్టీలను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతల దుష్ప్రచారాలను నియోజకవర్గ ప్రజలెవ్వరూ నమ్మవద్దని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని లోకేశ్ అన్నారు.