వద్దన్నా వెళ్లాడు - వాగులో కొట్టుకుపోయిన ద్విచక్రవాహనదారుడు - PERSON WAS WASHED AWAY IN STREAM - PERSON WAS WASHED AWAY IN STREAM
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 2:26 PM IST
Person Was Washed Away in Stream By Heavy Rain in NTR District : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ హెచ్చరికలను తేలికగా తీసుకోవద్దని అధికారులు చెబుతున్నారు. అత్యవసర పని ఉంటేనే ఇంట్లో నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. అది విస్మరించి బయటకి వచ్చిన ఓ ద్విచక్ర వాహనదారుడు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే చందర్లపాడు మండలంలో ముప్పళ్ల వాగు వర్షానికి ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రోడ్డుపై వర్షపు నీరు ప్రవాహం మరింత ఎక్కువైంది. స్థానికులు ఆ ద్విచక్ర వాహనదారుడిని వెళ్లొద్దని కేకలు వేసినా అతను పట్టించుకోకుండా లారీ వెనుకగా వెళ్లాడు. కొద్ది దూరం వెళ్లే సరికి నీరు ప్రవహానికి అదుపుతప్పి స్థానికులు చూస్తుండగానే ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోయాడు. వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి వీడియో ప్రస్తుతం సామజిక మాధ్యమంలో వైరల్గా మారింది.