ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో ప్రాణహాని ఉంది: హేమచంద్రా రెడ్డి - Allegations on Srikalahasti MLA - ALLEGATIONS ON SRIKALAHASTI MLA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 1:55 PM IST
Life Threat From Srikalahasti YCP MLA Madhusudhan Reddy : వైసీపీ ఎమ్మెల్యే వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన అనుచరుడు నిరసన చేయడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలంటూ ఆయన అనుచరుడు హేమచంద్రా రెడ్డి నిరసనకు దిగాడు. శ్రీకాళహస్తిలోని బిక్షాల గాలిగోపురం వద్ద ఫ్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టాడు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని వెండిని విక్రయించేందుకు మధుసూధన్ రెడ్డి బెంగళూరులోని ఓ మహిళ వద్దకు తనను పంపించారని హేమచంద్రా రెడ్డి ఆరోపించారు. వెండిని విక్రయించి 10 లక్షల రూపాయలను ఎమ్మెల్యేకు చేర వేశానని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కబ్జా చేసిన డీకేటీ భూముల వివరాలను సైతం త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఆయన అవినీతిపై సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆయన కుటుంబీకుల నుంచి ప్రాణహాని ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తనకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు.