బొజ్జల సుధీర్‌రెడ్డిపై వ్యక్తి కత్తితో దాడికి యత్నం - పోలీసులకు అప్పగింత - KNIFE ATTACK ON SUDHEER REDDY - KNIFE ATTACK ON SUDHEER REDDY
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 3:11 PM IST
Person Attack with Knife on TDP Leader Bojjala Sudheer Reddy : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై (TDP Leader Sudheer Reddy) ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. శ్రీకాళహస్తిలోని 5వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ముని కుమార్ అనే వ్యక్తి బొజ్జల సుధీర్ రెడ్డితో సెల్ఫీ తీసుకుంటానని చెప్పి కత్తితో దూసుకు వచ్చాడు.
Srikalahasti TDP MLA Candidate Election Campaign: అతడు కత్తితో రావడాన్ని గమనించిన స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తమై ఆ యువకుడిని అడ్డుకున్నారు. వెంటనే స్థానిక నేతలు అతడిని అదుపులోకి తీసుకొని రెండో పట్టణ పోలీసులకు అప్పగించారు. ముని కుమార్ ఏ కారణంతో దాడికి యత్నించాడని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో అధికార పార్టీల హస్తం ఉండొచ్చని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.