స్వీప్ పేరుతో ఓటు అవగాహన సదస్సు - ఫ్లాష్ మాబ్ నిర్వహించిన వైద్య విద్యార్థుల - People Vote Awareness Conference - PEOPLE VOTE AWARENESS CONFERENCE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-04-2024/640-480-21117707-thumbnail-16x9-sweep-program.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 2:06 PM IST
People Vote Awareness Conference Called 'Sweep' in Ongole: ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రకాశం జిల్లా అధికారులు స్వీప్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా వినూత్న తరహాలో ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు ఆదివారం రాత్రి ఒంగోలు పట్టణంలోని ఒక మాల్లో ఫ్లాష్ మాబ్ కార్యక్రమం చేపట్టి ఓటర్లను చైతన్య పరిచారు. వివిధ రకాల నృత్యాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. వైద్య విద్యార్థులు నిర్వహించిన ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైన అన్నారు.
ఓటు వేయడానికి ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నన్నారు కాబట్టి అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకుందామన్నారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజలను చైతన్యం చేయటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. జిల్లా స్వీప్ నోడల్ అధికారి జ్యోతి మాట్లాడుతూ స్వీప్ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను చైతన్యం చేయడానికి విద్యార్థుల ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.