ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేస్తే ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది: వెలిగొండ నిర్వాసితులు - veligonda project problems
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 4:50 PM IST
People Problems With Veligonda Project : వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ ఎదుట నిర్వాసితులు ధర్నాకు దిగారు. ప్రాజెక్టు కోసం తాము సర్వం త్యాగం చేస్తే ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండానే ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. దీంతో ప్లకార్డులు పట్టుకుని రైతు సంఘం నాయకులతో కలిసి నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కారం చేయకుండానే నీళ్లు ఇస్తామనడం హాస్యాస్పదమని సీఐటీయూ నాయకులు జీవి కొండారెడ్డి అన్నారు.
తక్షణమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అవసరమైన నిధులు, నిర్వాసితులకు గ్రాంట్లు ఈ బడ్జెట్ లోనే కేటాయించాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా 2024 మార్చి నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువతకు R&R ప్యాకేజీ, ఇంటి స్ఠలం ఇవ్వలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాకే ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించడానికి ఇంతవరకు ఏ ఒక్క అధికారి, నాయకుడు ఇక్కడకు రాలేదని నిర్వాసితులు వాపోయారు.