కలుషితం అవుతున్న నీరు, పట్టించుకోని అధికారులు- ప్రజల ప్రాణాలతో చెలగాటం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 9:01 AM IST
People Problems With Polluted Water At Kanigiri: గత కొన్ని రోజుల క్రితం గుంటూరు, బాపట్ల జిల్లాలలో కలుషిత నీరు తాగి డయేరియాతో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదే పరిస్థితి ప్రస్తుతం కనిగిరిలో పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేతులు, కాళ్లు విరిగిన వారికి పెద్ద పెద్ద కట్లు కట్టినట్టు పైపులైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో పగిలిన నీటి పైపులు, తుప్పు పట్టి పగిలిపోయిన నీటి పైపులు, కుళాయిలకు రబ్బరు ట్యూబులతో తగరపు కాగితాలతో కట్లు కట్టారు పురపాలిక అధికారులు. మురుగు కాల్వలో నిర్మించిన నీటి పైపులు పగలడంతో కాల్వలోని నీరు పైపుల ద్వారా ప్రజల ఇళ్లకు చేరుతున్నాయి.
రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కనిగిరిలో మురుగు కాల్వలో నీటి పైపులు ఉండటంతో అవి కాస్త లీకు అవుతూ నీరు కాలుషితమై దుర్వాసన వస్తుండటంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్న ఒక్క పైప్ లైన్ వేసిన దాఖలు లేవు. తుప్పు పట్టిన పైపులైన్లకు రంధ్రాలు పడి వాటి ద్వారా నీళ్లు లీకు అవ్వడంతో తగరపు కాగితాలు, రబ్బరు టూబులతో పైపులకు అంతంత మాత్రంగా మరమ్మత్తులు చేసి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఇకనైనా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.