ఎన్టీఆర్ భవన్‌కు వెల్లువెత్తిన వినతులు - సమస్యల పరిష్కారిస్తామని సిబ్బంది హామీ - People flocked to NTR Bhavan - PEOPLE FLOCKED TO NTR BHAVAN
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 5, 2024, 4:54 PM IST
People flocked to CM Chandrababu residence and NTR Bhavan: సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి, తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న తమను సీనియార్టీ ప్రకారం క్రమబద్ధీకరించాలంటూ వచ్చిన వారి నుంచి సీఎం కార్యాలయ సిబ్బంది వినతులు స్వీకరించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగకపోగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో జూనియర్లకు ప్రాధాన్యమిచ్చి అన్యాయం చేశారని గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు వాపోయారు. చంద్రగిరి నియోజకవర్గంలో తాము కొనుగోలు చేసిన భూమిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారని న్యాయపోరాటం చేస్తుంటే కడపకు చెందిన నేతలు గత ఏడాది ఇళ్లు కూడా నిర్మించేశారని వృద్ధ దంపతులు వాపోయారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో వినతిపత్రాలు అందచేశారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి వినతి పత్రాలు తీసుకుని తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సిబ్బంది హామీ ఇచ్చారు.