ప్రచారంలో తమ్మినేనికి అవమానం - ఐదేళ్లుగా సమస్యలను ఎందుకు పట్టించుకోలేదని నిలదీత - People fires on Tammineni Sitaram - PEOPLE FIRES ON TAMMINENI SITARAM
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 9:47 PM IST
People Blocked Tammineni Sitaram Vehicle During Election Campaign : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే సమయం ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ప్రచారంలో వైఎస్సార్సీపీ ఆమదాలవలస ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ తమ్మినేని సీతారాంకు అవమానం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిన్న సలంత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో ప్రచారానికి వచ్చిన స్పీకర్ను గ్రామస్థులు అడ్డుకున్నారు. రహదారి నిర్మాణం చేపడతామని చెప్పి ఐదేళ్లు అయిందని ఇంత వరకు నిర్మించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లుగా సమస్యలు తెలుసుకోవటానికి రాని మీరు ఇప్పుడు ఓట్లు అడగటానికి ఎలా వస్తారు అంటూ గ్రామస్థులు తమ్మినేని సీతారాంను నిలదీశారు. దీంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, గ్రామస్థులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. నిధులు మంజూరు చేశాం కానీ గుత్తేదారు నిర్మాణం చేపట్టకుండా వెళ్లిపోయాడంటూ స్పీకర్ చెప్పుకొచ్చారు. అయితే సమస్యలు పరిష్కరించని నాయకులకు మేము ఓట్లు వేయమని స్థానికులు తేల్చి చెప్పటంతో అక్కడి నుంచి తమ్మినేని సీతారాం వెళ్లిపోయారు.