పింఛన్ దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్ సర్కార్ - ఇంటి వద్దనే ఇవ్వాలని వేడుకుంటున్న వృద్ధులు - Pensioners Problems In AP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 9:20 PM IST
Pensioners Facing Problems Across State : ముఖ్యమంత్రి జగన్ మోహాన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం పింఛన్ దారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బ్యాంకుల్లో నగదు జమ చేయడంతో వృద్దులు, వికలాంగులు, నడవలేని వారు మండుటెండల్లో పెన్షన్ డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు వెళ్తున్నారు. పెన్షన్ తీసుకుందామని బ్యాంకు అధికారులను అడిగితే అకౌంట్లు ఆక్టివ్గా లేవని చెబుతున్నారు. ఆధార్, పాన్ వివరాలు ఇస్తేనే పెన్షన్ డబ్బులు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెబుతుండటంతో పింఛన్ దారులు ఆమోమయానికి గురవుతున్నారు.
ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలనే ఆదేశాలు ఉన్న కావాలని తమను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ఇలా చేస్తుందని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ డబ్బులతోనే మందులు కొనుగోలు చేస్తామని, ఇప్పుడు పెన్షన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదని వాపోతున్నారు. పెన్షన్ వస్తుందని చేతిలో ఉన్న 20 రుపాయలతో బ్యాంక్ కు వచ్చామని, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్లేందుకు కూడా తమ వద్ద డబ్బులు లేదని వృద్దులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.