ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి జ్యోతిక - JYOTHIKA VISITED IN TIRUMALA

స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న జ్యోతిక

Actress Jyothika Visited in Tirumala
Actress Jyothika Visited in Tirumala (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 11:04 AM IST

Actress Jyothika Visited in Tirumala : తిరుమల శ్రీవారిని కోలివుడ్ హీరో సూర్య సతీమణి, సినీ నటి జ్యోతిక ఇవాళ తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో జ్యోతికకు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. జ్యోతికను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆమెతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది.

జ్యోతిక ఒకప్పటి దక్షిణాది అగ్ర తారగా వెలుగొందారు. ఆమె నటన గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. షాక్, ఠాగూర్, చంద్రముఖి, సినిమాలు తన నటనకు అద్దం పట్టాయి. వర్థమాన హీరోయిన్లు ఆమెలా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు. సూర్యతో వివాహం తర్వాత యాక్టింగ్​కు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని యాడ్స్​లో నటించారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే చాలా కాలం తర్వాత జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఆకట్టుకునే అందంతో ఏమాత్రం తగ్గేది లేదంటున్నారు. ఈ మధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

ఆంజనేయస్వామిని దర్శించుకున్న శ్రీదేవి కూతురు -​ ఆశీర్వదించిన వేద పండితులు

శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్-ఉపాసన - సుప్రభాత సేవలో పాల్గొన్న దంపతులు - Ram Charan Couple Visit in Tirumala

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.