KING COBRA IN TIRUMALA: తిరుమలలో భారీ నాగుపాము కలకలం రేపింది. మంగళవారం స్థానిక రింగ్‌రోడ్డు సమీపంలోని బి-టైప్ క్వార్టర్స్ 23వ గది వద్ద ఎనిమిది అడుగుల నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అటవీశాఖ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు. పామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. దాంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
'కింగ్ కోబ్రాకు కష్టమొచ్చింది'- ఆడ కోబ్రా వెళ్లిపోవడంతో గుడ్ల సంరక్షణ - KING COBRA EGGS
మానవాళికి శాపంగా భూతాపం- మన కర్తవ్యమేంటి? ఏం చేయాలి? - World Environment Day 2024