బీఆర్ స్టేడియాన్ని తీర్చిదిద్దుతాం- గుంటూరులో పెమ్మసాని పర్యటన - pemmasani chandra sekhar - PEMMASANI CHANDRA SEKHAR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 1:03 PM IST

Pemmasani Chandra Sekhar Meet Athletes and Sports Association Leaders: గుంటూరులోని బీఆర్ స్టేడియాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని టీడీపీ పార్లమెంటు అభ్యర్థి (Guntur Mp Candit) పెమ్మసాని చంద్రశేఖర్‌ చెప్పారు. గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌తో కలిసి ఈరోజు స్టేడియాన్ని సందర్శించారు. ఉదయం వాకింగ్‌ చేయడానికి వచ్చిన వారితో పాటు క్రీడాకారులు, క్రీడా సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. 

Pemmasani Assured Development Of Br Stadium: పండ్ల మార్కెట్‌లో వ్యాపారుల్ని కలిసి వారి ఇబ్బందులపై పెమ్మసాని ఆరా తీశారు. ఎన్డీయే (NDA Alliance) కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్‌ స్టేడియాన్ని క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేయడంతో పాటు మంచి వాకింగ్ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామని పెమ్మసాని హామీ ఇచ్చారు. పండ్ల మార్కెట్‌ కోసం ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం వ్యాయామ స్టేడియాన్ని క్రికెట్ స్టేడియంగా మార్చాలని చూస్తోందని వ్యాయామానికి ప్రత్యామ్నాయం చూపించి బీఆర్ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని పెమ్మసాని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.