ఆదిమూలం ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి ఏమన్నారంటే! - AP Latest News

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 5:57 PM IST

Peddireddy Responded to MLA Adimulam Allegations: సత్యవేడు శాసనసభ్యుడు కోనేటి ఆదిమూలం తనపై చేసిన ఆరోపణలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. తనను అవినీతి పరుడంటున్న వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని జిల్లా ప్రజలకు తానేంటో తెలుసని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 3న అనంతపురంలో జరగనున్న 'సిద్దం' సభకు సంబంధించి తిరుపతిలో రాయలసీమ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాని అన్నారు. ఆయనను కష్టపడి గెలిపించామని తెలిపారు. తిరుపతి ఎంపీగా కొత్త అభ్యర్థిని నియమిస్తామన్నారు. అనంతపురంలో జరగనున్న సిద్ధం సభ ద్వారా ఎన్నికలకు సమాయత్తమవుతామని అన్నారు.

MLA Adimulam Comments: తనకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా కుట్ర చేసింది మంత్రి పెద్దిరెడ్డే అని ఆరోపించారు. పార్టీలో ఎస్సీలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. ఇష్టం లేకపోయినా నన్ను తిరుపతి ఎంపీ స్థానం ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారని అన్నారు. రేయింబవళ్లు కష్టపడ్డానని, పార్టీకి విశ్వాసపాత్రుడిగా ఉన్నానని ఆదిమూలం అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.