LIVE: అరకులో షర్మిల ఎన్నికల ప్రచారం - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Election Campaign - YS SHARMILA ELECTION CAMPAIGN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 27, 2024, 4:41 PM IST

Updated : Apr 27, 2024, 4:52 PM IST

PCC President YS Sharmila Election Campaign in Anakapali District : ఎన్నికలు సమీపిస్తున్న వేళ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రచార జోరును పెంచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ పాయకరావుపేట, పాడేరు, అరకులో పర్యటించారు.  సీఎం జగన్​ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి ఇప్పుడు దగా డీఎస్సీ ఇచ్చారని పాయకరావుపేట బహిరంగ సభల్లో షర్మిల ధ్వజమెత్తారు. ఎన్నికలు 2 నెలలు ఉందనగా ఇప్పుడు నిరుద్యోగులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. కుంభకర్ణుడు ఆరు నెలలు మాత్రమే నిద్రపోతాడు, సీఎం జగన్​ మాత్రం అయిదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు సిద్దమంటూ నిద్రలేచారని ఎద్దేవా చేశారు. గతంలో పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగాను అని చెప్పి ఇప్పుడు సర్కారే మద్యం అమ్ముతోందని మండిపడ్డారు. నాసిరకం మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారని ఆరోపించారు. ఆ మద్యం తాగి ప్రజలు చనిపోతున్న పట్టించుకోలేని పరిస్థితిలో సీఎం జగన్​ ఉన్నారని పేర్కొన్నారు.
Last Updated : Apr 27, 2024, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.