బీజేపీ ప్రభుత్వం ప్రశాంతంగా ఒక యాత్ర కూడా చేయనివ్వదా !: షర్మిల - పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 9:50 PM IST
PCC President YS Sharmila concern in Visakhapatnam: అసోంలో రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్రపై బీజేపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ పిలుపు మేరకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రశాంతంగా యాత్ర చేసుకునే పరిస్థితి కూడా లేదని ఆమె మండిపడ్డారు. తక్షణమే అసోం ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి, గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు.
అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న వారిపై బీజేపీ నేతలు దాడులు చేసి వారిని గాయపరిచారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా ఒక యాత్రను కూడా చేయనివ్వకపోటమే ప్రజాస్వామ్యమా? ఎక్కడో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగితే అసోంలో ఉన్న రాహుల్ గాంధీ గుడికి ఎందుకు వెళ్లకూడదు. గుడికి వెళ్లటానికి కూడా మోదీ పర్మిషన్ తీసుకోవాలా? ఇంత నీచమైన పరిపాలన చేస్తుంటే దీనిని ప్రజాస్వామ్యం అని ఎలా అంటారు. అసోంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి. -వైఎస్ షర్మిల,పీసీసీ అధ్యక్షురాలు