జల్జీవన్ మిషన్ గ్రాంట్ వివరాలివ్వండి - అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం - Pawan Kalyan Review - PAWAN KALYAN REVIEW
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 27, 2024, 5:18 PM IST
Pawan Kalyan Review on Rural Water Supply and Panchayat Raj: జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) అధికారులను ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించిన పవన్ తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాల్సిందిగా స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను వినియోగించుకోలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.