కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందంతో జనసేనాని భేటి - Pawan Meeting With BJP Central Team
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 11, 2024, 9:35 AM IST
Pawan Kalyan Meeting With BJP Central Team In Vijayawada : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ కేంద్ర ప్రతినిధులతో భేటి అయ్యారు. బీజేపీ అభ్యర్థుల ఖరారులో భాగంగా రెండు రోజుల పర్యటనకు విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బృందంతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దాదాపు గంటసేపు చర్చించారు. ఏయే స్థానాల్లో ఎవరెవర్ని బరిలో ఉంచాలనే అంశం పై చర్చించిన్నట్లు సమాచారం. ఇవాళ (సోమవారం) మరోసారి ఇరు పార్టీ నేతలు సమావేశం (Meeting) కానున్నారు.
Pawan Kalyan Met BJP Leaders In Vijayawada : ఈ భేటిలో చర్చకు వచ్చిన అంశాలను మీడియాకు వివరించేందుకు పవన్ సున్నితంగా తిరస్కరించారు. ఇవాళ మరో విడత మూడు పార్టీల నాయకుల మధ్య సమావేశం ఉందని, అనంతరం వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల వేళ జనసేన (Janasena)- టీడీపీ (TDP)లు ఎన్డీయే కూటమిలో చేరడంతో రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏ పార్టీ నుంచి ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే అంశం ఉత్కంఠగా మారింది.