LIVE: కాకినాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం- ప్రత్యక్ష ప్రసారం - Pawan Chanrababu Public Meeting - PAWAN CHANRABABU PUBLIC MEETING
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 9:15 PM IST
Pawan, Chanrababu Public Meeting in Kakinada LIVE : ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాకినాడలో పర్యటిస్తున్నారు.అధికార వైసీపీ అయిదేళ్ల పాటు సాగించిన అరాచకాలు, అభివృద్ధి నిరోధక విధానాలపై నిప్పులు చెరిగారు. అదే సమయంలో జిల్లా అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలు, అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాలు, మ్యానిఫెస్టోను వివరిస్తూ ప్రజల్లో భరోసా నింపారు. చంద్రబాబు సభకు జనం అధిక సంఖ్యలో తరలిరావడం ఆ పార్టీ అభ్యర్థులు, శ్రేణుల్లో జోష్ నింపింది.అధికారంలోకి వస్తానే ముస్లిం సోదరులకు యాభై ఏళ్లకే పింఛన్ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించి మాదిగలకు న్యాయం చేస్తామని తెలిపారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, రూ.3 వేలు నిరుద్యోగ భృతి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ప్రస్తుతం కాకినాడ సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగిస్తున్నారు.