ఆస్పత్రిలో అంధకారం- సెల్ఫోన్లైటుతో రోగులకు చికిత్స - PATIENTS SUFFER in GOVT HOSPITAL WITHOUT POWER - PATIENTS SUFFER IN GOVT HOSPITAL WITHOUT POWER
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 6, 2024, 12:15 PM IST
Patients Suffer as Govt Hospital Without Power in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం రాత్రి అంధకారం నెలకొంది. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనరేటర్, ఇన్వర్టర్లు పని చేయకపోవడంతో అత్యవసర విభాగం గాఢాంధకారంతో నిండిపోయింది. విద్యుత్ సదుపాయం లేక వైద్యులు చీకటిలోనే రోగులకు చికిత్స అందించారు. ఇటీవల ఆస్పత్రిలో కొత్తగా జనరేటర్ అందుబాటులోకి తెచ్చినా అది తరచూ రిపేర్‌కు వస్తోందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
బుధవారం సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:15 వరకు సరఫరా లేకపోవడంతో వైద్యులు, నర్సులు సెల్ ఫోన్ల వెలుతురులో వైద్యం అందించాల్సి వచ్చింది. ఆ సమయంలో రోడ్డు ప్రమాద బాధితులు రావడంతో చీకటిలో వైద్యం అందించడానికి ఇబ్బందులు తప్పలేదు. ఇన్వర్టర్లు మరమ్మతుకు గురయ్యాయి. కొన్నాళ్లుగా తరచూ ఆసుపత్రిలో ఇలాంటి సమస్య ఎదురువుతోందని రోగులు వాపోతున్నారు. సమస్యను ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ ఎల్లోజిరావు దృష్టికి తీసుకెళ్లగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా తక్షణ చర్యలు చేపడతామన్నారు.