విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు- దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు - Parents Attack on School Teacher

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 6:54 PM IST

Updated : Aug 8, 2024, 7:37 PM IST

thumbnail
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడు- దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు (ETV Bharat)

Teacher Misbehaving with Students: గురువు అంటే తండ్రిలాంటివాడు. విద్యాబుద్ధులు నేర్పుతూ విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. అయితే కొందరు గురువులు గాడి తప్పుతూ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాంటి ఘటనే  పల్నాడు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 

Parents Attack on Model School Teacher: జిల్లాలోని కారంపూడిలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. కారంపూడి మోడల్ స్కూల్‌లో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న రవికుమార్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో మోడల్ స్కూల్‌కు వచ్చిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రవికుమార్‌పై దాడి చేశారు. గురువు స్థానంలో ఉండి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహంలోకి వెళ్లి అభ్యంతకరంగా ప్రవర్తిస్తుంటే పాఠశాల సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే రవికుమార్‌ను విధులు నుంచి తొలగించాలని ఆందోళన చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఏంఈవో, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Last Updated : Aug 8, 2024, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.