నాయకులు శాంతిభద్రతలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఎస్పీ మలికా గార్గ్ - Palnadu District New SP Malika Garg - PALNADU DISTRICT NEW SP MALIKA GARG

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 9:37 PM IST

Palnadu District New SP Malika Garg: పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణం తీసుకువస్తామని ఎస్పీ మలికా గార్గ్ అన్నారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మలికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరిగిన గొడవల కారణంగా గత ఎస్పీ బిందు మాధవ్​ను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మల్లిక గార్గ్ జిల్లా నూతన ఎస్పీగా నియమితులయ్యారు. నూతన ఎస్పీ మల్లిక గార్గ్​కు జిల్లా సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. 

అనంతరం కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్ మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణం తీసుకువస్తామని తెలిపారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ సజావుగా జరగడం, లా అండ్ ఆర్డర్​ని అదుపులోకి తీసుకురావడమే తన ముందున్న మొదటి లక్ష్యమని అన్నారు. కొన్ని ఘటనల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని మలికా గార్గ్ చెప్పారు. రాజకీయ నాయకులు శాంతిభద్రతలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.