పల్నాడు జిల్లాలో తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే! - Palnadu Counting Arrangements - PALNADU COUNTING ARRANGEMENTS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 2:39 PM IST

Palnadu Counting Arrangements: పల్నాడు జిల్లా ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు సర్వం సిద్ధం చేశారు. లెక్కింపు ప్రక్రియకు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ బి.లాత్కర్ నేతృత్వంలో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పల్నాడు జిల్లాలో 14 లక్షల 85 వేల 909 ఓట్లు పోలయ్యాయి. నరసరావుపేట సమీపంలో కాకాని వద్ద ఉన్న జేఎన్​టీయూలో ఈ నెల 4న కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది.  ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 చొప్పున టెబుళ్లు ఏర్పాటు చేశారు. మెుత్తం 700 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. 

జిల్లాలో తొలి ఫలితం చిలకలూరిపేట నుంచి వెలువడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గురజాల నియోజకవర్గం నుంచి తుది ఫలితం వెల్లడి కానుంది. కౌంటింగ్ రోజు దాడులు, అల్లర్లు, ఘర్షణలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.