'సంప్రదాయ పంటలు, చిరుధాన్యాలు పోషకాల గనులు' - TERRACE GARDEN HARVEST - TERRACE GARDEN HARVEST
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 16, 2024, 12:32 PM IST
Terrace Garden Harvest 20th Meet in Nellore : సంప్రదాయ పంటలు, చిరుధాన్యాలు పోషకాల గనులు అని పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదరవలి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నెల్లూరు మిద్దె తోటల సభ్యుల 20వ మీట్ లో భాగంగా రైతునేస్తం ఫౌండేషన్, నెల్లూరు మిద్దెతోటలు, సత్యంజీ గ్రూప్ సంయుక్త నిర్వ హణలో కషాయం, చిరుధాన్యాల వల్ల ఆరోగ్యం, ఇంకుడు గుంతల గురించి అవగాహన సదస్సు నగరంలోని జెట్టి శేషారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం జరిగింది. వారు మాట్లాడుతూ పురుగు మందులు, జన్యుమార్పిడి పంటలు, కల్తీ వంట నూనెలు తదితర వాటివల్ల మని ఆరోగ్యం దెబ్బతింటోందని, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయన్నారు.
Padmasri Khadar Vali attended Millet Awareness Meeting in Nellore : చిరుధాన్యాలు, కషాయం తీసుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చన్నారు. రిటైర్డ్ రీజ నల్ డైరెక్టర్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ డాక్టర్ గంజి సుదర్శన్, ఇంకుడు గుంటల నిపుణులు ఆర్. ఆంజనేయులు, మిద్దెతోటల బృందం సభ్యులు గోపిశెట్టి సందీప్, సత్యంజీ, మంజులమ్మ, ఆధ్యాత్మిక వేత్త భాస్కర్ రెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు.