జీవీఎంసీ నూతన కమిషనర్‌గా సంపత్‌ కుమార్‌ బాధ్యతలు స్వీకరణ - New GVMC Commisioner - NEW GVMC COMMISIONER

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 4:38 PM IST

Sampath Kumar Took Charge as Commissioner of GVMC : మహా విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్​గా పి. సంపత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నూతన కమిషనర్​కు జీవిఎంసీ అధికారులు, నగర ప్రజాప్రతినిధులు అభినందలు తెలియజేశారు. ఈ సందర్భంగా పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ "విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, సుందరమైన ప్రాంతం. 25 లక్షల జనాభా ఉన్న నగర ప్రజలను, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాను. విశాఖ మహా నగర పాలక సంస్థ అభివృద్ధికి కృషి చేస్తాను. ఇప్పటి నుంచి అధికారులు క్రమశిక్షణతో, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సమస్యలన్నీంటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. 

నగర సమస్యల పరిష్కారానికి వంద రోజులు ప్రణాళిక వేసుకున్నాము. దాని ప్రకారం ముందుకు వెళ్తాం. ఇప్పటి నుంచి పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒక నిర్దిష్ట వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధన్యవాదాలు" అని పి. సంపత్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు కమిషనర్‌గా పనిచేసిన సాయికాంత్‌వర్మను ప్రభుత్వం ఈనెల 9న బదిలీ చేసి, కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌కు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. 2016 బ్యాచ్‌కు చెందిన సంపత్‌ కుమార్‌ ఎన్టీఆర్‌ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీపై జీవీఎంసీ కమిషనర్‌గా వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.