అయినవాళ్లు లేకున్నా అనుకున్నది సాధించాడు - 10 ఏళ్లు కష్టపడి 4 సర్కార్ కొలువులు కొట్టేశాడు - OU Student Got 4 jobs
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-03-2024/640-480-20982416-thumbnail-16x9-nagaraju.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 14, 2024, 2:39 PM IST
OU Student Got 4 Government Jobs : ప్రభుత్వ ఉద్యోగం. దీనిని సాధించడాన్ని ఎంతోమంది యువత కలగా పెట్టుకుంటారు. ఆ కలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు కష్టపడుతుంటారు. లక్ష్యాన్ని చేరుకోవడంలో కొన్నిసార్లు విఫలమైనా, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలు ఎగిరి గంతేస్తారు. అలాంటిది 4 సర్కార్ కొలువులు కొట్టేశాడు ఆ యువకుడు. అయిన వాళ్లు లేకున్నా, చిన్నమ్మ, అక్క ప్రోత్సాహంతో ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యం పెట్టుకుని దాదాపు 10 సంవత్సరాలుగా ఆహర్నిశలు ఇష్టంతో కష్టపడి చదివాడు. ఇప్పుడు ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
Interview with Nagaraju who got 4 government jobs : కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, పట్టుదలతో ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షలకు హాజరై, తన కలలను నిజం చేసుకున్నాడు. ఏకంగా టీజీటీ, పీజీటీ, యూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ వంటి 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన నాగరాజుతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.