ఆటోను ఢీ కొట్టిన సీఐ కారు - ఇంటర్ విద్యార్థి మృతి - CI CAR HIT THE AUTO
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2024, 6:56 PM IST
CI Car Hit The Auto One Died in Sri Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం పట్నం సమీపంలో జాతీయ రహదారి 42పై సీఐ హారూన్ బాష కారు ఆటోను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇంటర్ ఇంటర్ విద్యార్థి విష్ణువర్ధన్ మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, అనంతపురం నుంచి కదిరి వస్తున్న సీఐ హారూన్ బాష కారు 8 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఓ విద్యార్థి విష్ణువర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా వారికి తీవ్రగాయాలయ్యాయి. సీఐ హారూన్ బాషాకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన సీఐపై చర్యలు తీసుకోవాలంటూ వేమారెడ్డి కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. మృతుల కుటుంబసభ్యులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ హారూన్ బాషపై కేసు నమోదు చేస్తామని, ఆందోళన నిర్మించాలని కదిరి అర్బన్ సీఐ నారాయణరెడ్డి విజ్ఞప్తి మేరకు ధర్నా విరమించారు.