వైఎస్ షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టులు - ఒకరు అరెస్ట్
🎬 Watch Now: Feature Video
One Person Arrest Obscene Posts on YS Sharmila and Sunitha: నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలపై అసభ్యకర పోస్టులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అసభ్యకర పోస్టులు వస్తున్నాయని వైఎస్ సునీతా రెడ్డి ఇటీవల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆమె మాత్రమే కాకుండా పులివెందులలో వర్రా రవీంద్రా రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై దర్యాప్తు చేపట్టిన కడప పోలీసులను ఒకరిని అరెస్టు చేశారు.
వైఎస్సార్ కడప జిల్లా అదనపు ఎస్సీ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్న వ్యక్తిని విశాఖలో అరెస్టు చేసినట్లు వివరించారు. విశాఖకు చెందిన ఉదయ భూషణ్ సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. ఈ నేపధ్యంలో అతను పులివెందుల వైఎస్సార్సీపీ ఇంచార్జ్ వర్ర రవీంద్రనాథ్ రెడ్డి పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాను సృష్టించినట్లు పోలీసులు తెలిపారు.
ఆ ఖాతా ద్వారా అసభ్యకర పోస్టులు పెట్టడం ప్రారంభించారు. అసభ్యకర పోస్టుల విషయం రవీంద్రా రెడ్డి దృష్టికి రావడంతో ఆయన పులివెందుల పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పులివెందుల పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా విశాఖలోని మహారాణిపేటకు చెందిన ఉదయ భూషణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఫేస్బుక్లో వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు.