నిండుకుండలా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు - 6 గేట్ల ఎత్తివేత - Water Release From Nagarjuna Sagar - WATER RELEASE FROM NAGARJUNA SAGAR
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 28, 2024, 12:53 PM IST
|Updated : Aug 28, 2024, 10:21 PM IST
Water Releasing From Srisailam Dam : ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం 6 గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1.68 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 3.11 లక్షల క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి సాగుతోంది. విద్యుదుత్పత్తి ద్వారా 68,807 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటినిల్వ 312.50 టీఎంసీలుగా ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జురాల ప్రాజెక్టు నుంచి 2,52,935 క్యూసెక్కులు సుంకేసుల జలాశయం నుంచి 2,280 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం బుధవారం ఉదయం 10 గంటల సమయానికి 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉంది.
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు 1 లక్షా 26 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.