పంచాయతీ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు - అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు - Officials demolished illegal shops

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 7:36 PM IST

Officials Demolish Illegal Shops at NTR District : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పంచాయతీ కార్యాలయం వద్ద కట్టడాలను అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా పంచాయతీ పరిధిలో చికెన్, మటన్ దుకాణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం పంచాయతీ కార్యాలయానికి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రైవేట్ దుకాణాలు ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. 

No Political Involvement in Demolish illegal Shops : నిబంధనలకు విరుద్ధంగా పంచాయతీ స్థలాన్ని ఆక్రమించి చికెన్, మటన్ దుకాణాలను కొందరు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేశారని సిబ్బంది తెలిపారు. అక్రమ కట్టడాలను భారీ యంత్రాంగంతో పంచాయతీ సిబ్బంది తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన దుకాణలను ఏవైనా వాటిని కూల్చి వేస్తామని పంచాయతీ అధికారులు హెచ్చరించారు. పంచాయతీ స్థలాలను ఎవరైనా ఆక్రమించి అక్కడ కట్టడాలు నిర్మిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.