అరకులో పర్యాటకులకు కొత్త అనుభూతి - త్వరలో పారాగ్లైడింగ్ - PARAGLIDING ARRANGEMENT IN ARAKU - PARAGLIDING ARRANGEMENT IN ARAKU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 25, 2024, 5:38 PM IST
Para Gliding in Araku Valley: ఆంధ్ర ఊటీగా పిలుచుకునే అరకులోయలో పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా పాడేరు ఐటీడీఎ అధికారులు సాహసోపేతమైన పారా గ్లైడింగ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. అరకులోయ సమీపంలో పారా గ్లైడింగ్ చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు. అందమైన కొండల నడుమ గ్లైడింగ్ చేస్తూ పర్యాటకులు కొత్త అనుభూతిని పొందేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు.
ఇందులో భాగంగానే పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ కొద్దిసేపు పారా గ్లైడింగ్ చేసి కొత్త అనుభూతిని పొందారు. పరాగ్ లైటింగ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా పాడేరు ఐటీడీఎ ఆధ్వర్యంలో చేపడితేనే బాగుంటుందని స్థానికులు భావిస్తున్నారు. దీని ఆదాయంతో పాటు పర్యాటకులకు ఒక కొత్త అనుభూతి కలిగిస్తుందని వారు అంటున్నారు. దీని వలన ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని వారు నమ్ముతున్నారు. గతంలో కంటే టూరిస్టుల తాకిడి మరింత పెరిగి రాష్ట్ర ఖజానాకు ఆదాయం చేకూర్చే వనరుగా ఉంటుందని అంటున్నారు.