thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 7:59 PM IST

Updated : Feb 25, 2024, 8:17 PM IST

ETV Bharat / Videos

ఆస్ట్రేలియాలో టీడీపీ గెలుపును ఆకాంక్షిస్తూ ప్రవాసాంధ్రుల ర్యాలీ

NRIs Rally in Australia to support of TDP: తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆస్ట్రేలియాలోని మెల్​బోర్న్​లో ప్రవాసాంధ్రులు ర్యాలీ చేపట్టారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపును కాంక్షిస్తూ ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. ప్రజావ్యతిరేక విధానాలు చేస్తున్న వైసీపీకి ఈ సారి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షించారు. ఔత్సాహికులు లగడపాటి సుబ్బారావు , కొఱిదెన శ్రీకాంత్, మారుతీ ప్రకాష్, గోపీ నంబళ్ళ, నితిన్ విప్పర్ల, తాతినేని సుమ తదితరుల ఆధ్వర్యంలో శంఖారావం పూరించి ర్యాలీ నిర్వహించారు. 

వైసీపీ నాయకుల అధికారం అండతో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసే రోజు తొందర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు వారి అక్రమాలపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నో భూకబ్జాలు, సామాన్యులపై దాడులు అధికమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయానికి అంకితభావంతో పనిచేస్తామని ప్రవాసాంధ్రులు స్పష్టం చేశారు.

Last Updated : Feb 25, 2024, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.