వైఎస్సార్సీపీ సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసింది - మేము ప్రాధాన్యతిస్తున్నాం: మంత్రి నిమ్మల - Nimmala About Srisailam Project - NIMMALA ABOUT SRISAILAM PROJECT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 1, 2024, 2:18 PM IST
Nimmala Ramanaidu About Srisailam Project: సాగునీటి రంగాన్ని వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం చేస్తే, కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వ అలసత్వం వల్ల శ్రీశైలం ప్రాజెక్టు ముందుభాగంలో వంద అడుగుల మేర భారీ గొయ్యి పడిందని ఆరోపించారు. దీనివల్ల డ్యాం భద్రతకు ప్రమాదం పొంచి ఉందని స్పష్టం చేశారు. డ్యామ్ భద్రతకు ప్రమాదమని తెలిసినా మరమ్మతులకు అప్పట్లో జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో సీఎంతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాయలసీమను జగన్ ఎండబెడితే సస్యశ్యామలం చేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని వివరించారు. యావత్ రాష్ట్రానికి మేలు చేసే పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కారణంగా అంచనా వ్యయం పెరిగిపోతోందన్నారు. హైవే పనుల కారణంగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి నీటిని విడుదల చేయలేదని ఇవాళ నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాజెక్టులు నింపాలని ఆదేశించినట్లు తెలిపారు.