ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలని చూస్తే ఈసీ ఆదేశాలు ధిక్కరించినట్లే: నిమ్మగడ్డ రమేష్‌కుమార్ - Volunteer Participate in Election
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 3:40 PM IST
Nimmagadda Ramesh Kumar Comments on Volunteers : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాలంటీర్ల ద్వారా లబ్ధి పొందాలని చూస్తే ఎన్నికల కమిషన్ ఆదేశాలను ధిక్కరించినట్లేనని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (Citizens for Democracy) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హెచ్చరించారు. కాకినాడలోని దంతు కళాక్షేత్రంలో 'ఓటు వేద్దాం - ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఈఆర్వో పని చేయడం ఆందోళన కలిగిస్తోందని నిమ్మగడ్డ అన్నారు. ఈ కుట్రలో తీసుకున్న చర్యలు సంతృప్తికరం కాదని అన్నారు. తిరుపతి ఎన్నికల్లో 35 వేలకుపైగా నకిలీ ఓట్లు రూపొందించడం దేశంలోనే ఎక్కడా జరగలేదని, ఇది అత్యంత ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మూలాలు అన్వేషించి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉక్కుపాదంతో అణిచి వేయాలని డిమాండ్ చేశారు.
Volunteers Participating in Elections Programs? : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమంలో నిమ్మగడ్డ రమేష్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఐవీరావు సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి పల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొని క్రియాశీలంగా వ్యవహరించేందుకు సదస్సు నిర్వహిస్తున్నామని నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.