నిర్మల్‌లో సందడి చేసిన నేహాశెట్టి - అభిమానుల ఉత్సాహం - nirmal latest news
🎬 Watch Now: Feature Video
Published : Feb 5, 2024, 3:37 PM IST
Neha Shetty Opened Shopping Mall In Nirmal : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో పక్కన ఎల్వీఆర్ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన మాల్లో సినీతార, డీజే టిల్లు సినిమాలో నటించిన నేహా శెట్టి(Neha Shetty) సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. షాపులో కలియ తిరుగుతూ చీరలతో ఫోటోలకు పోజులిచ్చారు. షాపింగ్ మాల్‌కు చేరుకున్న ఆమెకు అభిమానులు, సిబ్బంది స్వాగతం పలికారు. నేహా శెట్టి రాకతో యువత కేరింతలుతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. మహిళలు, కుటుంబీకులు వస్త్రాలు కొనడానికి చాలా మక్కువ చూపిస్తారని ఆమె తెలిపింది.
Neha Shetty In Nirmal : షాపింగ్‌మాల్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా నేహా శెట్టి పలు గీతాలకు నృత్యాలు చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. ఆమెను చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. ఈ షాపింగ్ మాల్ కలెక్షన్స్ మగువలను కట్టిపడిసే విధంగా ఉన్నాయని నేహా శెట్టి తెలిపారు.