'పోరాడి సాధించుకున్న హక్కును హరిస్తోన్న జగన్ ప్రభుత్వం - ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధం'

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 22, 2024, 7:16 PM IST

Neglect of the Government in Implementing Reservations : ఎన్నో పోరాటాలు చేసి సాధించిన రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని రాష్ట్ర జేఏసీ సభ్యుడు ఆకుల రామకృష్ణ మండిపడ్డారు. అంబేడ్కర్​ జిల్లా రావులపాలెంలో ఆయన ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల రాష్ట్ర జేఏసీ ప్రతినిధుల రౌండ్​టేబుల్​ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తమ వర్గాల వారు రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కును ప్రభుత్వం అమలు చేయకపోవడంపై చర్చించారు.

కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు జనాభా ప్రతిపాదికన ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని ఆకుల రామకృష్ణ డిమాండ్​ చేశారు. లేని పక్షంలో ఓటు అనే ఆయుధంతో ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం తమకు 5 శాతం రిజర్వేషన్లు సౌకర్యం కల్పించిందని, ప్రస్తుత ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న తమ వర్గ జనాభాను లెక్కించి దామాషా పద్ధతి ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 28న విశాఖలో మరో రాష్ట్ర స్థాయి రౌండ్​ టేబుల్​ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.