LIVE: ఎన్డీయే సభ్యుల శాసనసభా పక్ష సమావేశం - ప్రత్యక్షప్రసారం - NDA Legislative party meeting - NDA LEGISLATIVE PARTY MEETING
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 11, 2024, 10:47 AM IST
|Updated : Jun 11, 2024, 11:56 AM IST
NDA Members Legislative Party Meeting LIVE : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు , కూటమిలోని ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో అందుకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు.సభకు రాష్ట్ర వ్యాప్తంగా 104 వైఎస్సార్సీపీ బాధిత కుటుంబాలను ఆహ్వానించారు. వారిలో పల్నాడు జిల్లా నుంచే 90 మంది ఉన్నారు. ఆహ్వానాలు అందుకున్న వారిలో చంద్రయ్య కుటుంబం, పాల్వాయిగేటు గ్రామ పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని అడ్డుకొని గాయపడ్డ నంబూరి శేషగిరిరావు కుటుంబం, పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ నాయకుల గొడ్డలి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ చేరెడ్డి మంజుల ఉన్నారు. ఎన్డీయే సభ్యుల శాసనసభా పక్ష సమావేశం - ప్రత్యక్షప్రసారం
Last Updated : Jun 11, 2024, 11:56 AM IST