LIVE: ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశం - ప్రత్యక్షప్రసారం - NDA Legislative Party Meeting Live - NDA LEGISLATIVE PARTY MEETING LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 18, 2024, 5:25 PM IST
|Updated : Sep 18, 2024, 7:18 PM IST
NDA Legislative Party Meeting Chaired by Chief Minister Chandrababu LIVE : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయ సమీపంలోని సీకే కన్వెన్షన్లో నేతలు భేటీ కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్య క్షురాలు పురందేశ్వరి సహా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరవుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మె ల్యేలు ఇంటింటికీ వెళ్లి 100 రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందించనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిగా 2024 జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 20కి 100 రోజులు కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ను రూ.4000కు పెంచడం జరిగింది. అలాగే నిరుద్యోగుల కోసం 16,437 మెగా డీఎస్సీ ప్రకటించారు. ఇలా 100 రోజుల్లో 100 విజయాలను సాధించి సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరుగుతుంది. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Sep 18, 2024, 7:18 PM IST