తిరుమలలో శారదా పీఠం అక్రమ నిర్మాణాలు - చర్యలకు టీటీడీని ఆదేశించిన ప్రభుత్వం - SARADAPEETHAM ILLEGAL CONSTRUCTIONS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2024, 3:35 PM IST

NDA Govt Rejects Previous TTD Board Proposal to Regularise Deviation at Visakha Sarada Peetham : తిరుపతిలో విశాఖ శారదాపీఠం నిర్మించిన భవన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. విశాఖలో కేటాయించిన భూముల రద్దుతో పాటు తాజా నిర్ణయంతో శారదాపీఠానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. 

 వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు గురువు, వివాదాస్పద స్వామి స్వరూపా నందేంద్రకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖలో శారదా పీఠానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన భూమిని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఆ పీఠం తిరుమలలో చేపట్టిన అక్రమ నిర్మాణానికి అడ్డుకట్ట వేసింది. ఇప్పటికే శారదాపీఠం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.  నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేస్తున్న సమయంలోనే వాటిని అడ్డుకుని కూల్చివేయాల్సి ఉన్నా టీటీడీ అధికారులు మాత్రం శారదాపీఠం నుంచి కేవలం వివరణ కోరారు. వాస్తు దోషం నివారణకే అదనపు నిర్మాణాలు చేపట్టినట్లు పీఠం నుంచి సమాధానం వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.